Site icon NTV Telugu

కార్తీక మాసోత్సవానికి ముస్తాబైన రాజన్న ఆలయం…

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ కార్తీక మాసోత్సవ సందర్భంగా ముస్తాబైంది. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని విద్యుత్‌దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆలయంలో నెల రోజుల పాటు స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

Exit mobile version