NTV Telugu Site icon

Auto Twist in Manchiryala: ఆటో ఎక్కి దిగాడు.. జేబులు తడుముకుని అవాక్కయ్యాడు

Auto Twist

Auto Twist

Auto Twist in Manchiryala District: కొందరు గబగబా ఆటో, బస్సు, కార్లు, బైక్‌ ఇలా ప్రయాణం కోసం పరుగులు పడుతుంటారు. కానీ, అందులో కొందరు వస్తువులు మరిచిపోతుంటారు. అది చూసిన కొందరు దాన్ని తిరిగి ఇచ్చేంస్తుంటారు. కానీ మరికొందరైతే దొరికిందే అలుసుగా భావించి దాన్ని తీసుకుని పరార్‌ అవుతుంటారు. ఇలాంటి సంఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆటోలో ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తి యూపీఐ వ్యాలెట్ యాప్ ద్వారా ఖాతాలో ఉన్న రూ. ఆరలక్షకు పైగా డబ్బు గుర్తు తెలియని వ్యక్తికి బదిలీ అయినట్లు తెలుసుకుని కంగుతిన్నాడు. ఫోన్లోనుంచే ఈ మొత్తం బదిలీ జరిగినట్లు తెలుసుకుని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు.

Read also: Kantara: ‘కాంతార’కి కోర్ట్ క్లియరెన్స్…

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన వీరప్రతాప్ సింగరేణిలో ఉద్యోగి. ఈనెల 23న తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ వెళ్లడానికి ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద ఓ ఆటో ఎక్కి ముందు సీట్లో కూర్చున్నాడు. పంజా గుట్ట చౌరస్తాకు రాగానే ఆటో డ్రైవర్ అతన్ని బలవంతంగా దించి బంజారాహిల్స్ వైపు హడావిడిగా వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత చూసుకోగా మొబైల్ ఫోన్ కని పించలేదు. ఆటో కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. అత్యవసరంగా స్వస్థలానికి వెళ్లాల్సి ఉండడంతో మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఖాతాలో డబ్బులు లేకపోవడాన్ని గమనించాడు. వెంటనే ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వివిధ ఖాతాలకు రూ.57,362 బదిలీ అయ్యాయని తెలుసుకున్నాడు. నగరానికి వచ్చిన అతను పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఇది ఆటో డ్రైవర్ పనే నని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆటో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Flipkart: ఆన్ లైన్‎లో ఫోన్ బుక్ చేస్తే.. వచ్చింది చూసి కంగుతిన్న కస్టమర్