Site icon NTV Telugu

గంజాయి పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌


గంజాయితో వచ్చే ఇబ్బందులను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విషయాలను చర్చిం చడంతోపాటు గంజాయి పండించే వారిని హెచ్చరించారు. గంజాయి పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వమని, పక్క రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారని మంత్రి అన్నారు.

గంజాయి మీద నిఘా పెట్టామని మంత్రి తెలిపారు. గంజాయితో పట్టుబడితే పీడీ యాక్ట్‌లు పెడతామని ఆయన హెచ్చరించారు. డిసెం బర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని ఆయన వెల్ల డించారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు వైన్‌ షాపుల్లో రిజర్వేషన్లు కల్పిం చిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గతం లో మాఫియాలా తయారు అయ్యి వైన్‌ షాపులను దక్కించుకునే వారని దీంతో అర్హులకు న్యాయం జరిగేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో అలాంటి పరిస్థితులు లేవని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Exit mobile version