Site icon NTV Telugu

మహా జాతరపై చిన్న చూపేలా..?

మేడారం మహాజాతర పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. జాతరకు ఇంకా నాలుగు నెలలే ఉంది. ఇప్పటికి జాతరకు సంబంధించిన పనులను మొదలు పెట్టలేదు. జాతరకు కోటిపై గా భక్తులు హాజరవుతారు. దానికి తగ్గట్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గత జాతరలో జరిగిన అపశృతులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు మొదలుపెట్టాల్సి ఉన్న ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించటం లేదు.

జాతర పనులను పర్యవేక్షించాల్సిన ఏటూరునాగారం ఐటీడీఏకు ఇప్పటి వరకు రెగ్యూలర్‌ పీవోను ప్రభుత్వం నియమించలేదు. దీంతో పనులను పర్యవేక్షించాల్సిన పీవో లేకపోవడం, జాతర సమయంలో హడావుడిగా నాసిరకంగా పనులు చేపట్టడం ఫలితంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి జాతర పనులను చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Exit mobile version