దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. కరోనా కారణంగా గతేడాది దీపావళి పండుగను ప్రజలు చేసుకోలేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి రెండురోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఏర్పడింది. ఉదయాన్నే పూజలు చేసి, శుభం కలగాలని కోరుతూ పండుగను చేసుకుంటున్నారు. సాయంత్రం ప్రజలు ఆరుబయటకు వచ్చి బాణా సంచా కాల్చూతూ పండుగను నిర్వహించుకుంటున్నారు.
హైదరాబాద్‌లో వివిధ కమ్యూనిటీల్లో ప్రజలు బాణా సంచా కాల్చుతూ పండుగను చేసుకుంటున్నారు. ఈ సారి గ్రీన్ కాకర్స్‌నే కాల్చుతు న్నారు. దీపావళి అంటనే టపాసుల మోత దీంతో చిన్నారులు, పెద్దలు టపాసలు పేల్చుతూ ఆనందంగా దీపావళి జరుపుకుంటు న్నారు. టపాసుల రేట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు గ్రీన్ కాకర్స్‌తో , కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను చేసుకుంటున్నారు. ఈ సారి దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.