The dancers who pushed the watchman down from the fourth floor: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్పైసీ రెస్టారెంట్ కు నలుగురు డాన్సర్లు వచ్చారు. బిల్డింగ్ లో ఉన్న రాఘవ గెస్ట్ హౌస్ లో నాలుగో ఫ్లోర్లో రూమ్ బుక్ చేసుకున్నారు. రూమ్ గది తాళాలు తీసుకుని మద్యం ఫుల్ గా సేవించారు. గట్టిగా సబ్దాలు రావడంతో డాన్సర్ల రూమ్ కి వాచ్ మెన్ వెళ్లాడు. నాలుగో ఫ్లోర్లోని డాన్సర్ల రూంకి వెళ్లాడు. గది తలుపులు కొట్టగా కోపంగా వచ్చిన డాన్సర్లు తలుపులు తీసి డిస్టబ్ చేయొద్దని కోపంతో అరిచారు. అయి వాచ్ మెన్ అలా అల్లరి చేయకూడదని సెలెంట్ గా ఉండాలని పక్కనే వున్న వారికి డిస్టర్బ్ అవుతుందని చెప్పినా వినకుండా వాచ్ మెన్ తో గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త వాదోపవాదానికి తెరతీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన డాన్సర్లు మద్యం మత్తులో వాచ్ మెన్ ని బిల్డింగ్ పైనుంచి తోసేశారు. నాలుగో ఫ్లోర్లోనుంచి కిందికి పడిన వాచ్ మెన్ అక్కడికక్కడే మృతిచెందారు.
Read also: Samyukta Menon : డైరెక్టర్‌కు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన విరూపాక్ష హీరోయిన్
అయితే రెస్టారెంట్ అధికారులు గమనించి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన డాన్సర్లు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్ పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. నలుగో ఫోర్లో వున్న డాన్సర్ల గదికి వెళ్లగా మధ్యలోనే పారిపోవడానికి ప్రయత్నించిన డాన్సర్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇందులో ఇద్దరు డాన్సర్లని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరి అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వాచ్‌మేన్ యాదగిరిగా గుర్తించారు. యాదగిరి వయసు 52 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు. డాన్సర్లు మద్యంతోపాటూ డ్రగ్స్ కూడా వాడినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకా పూర్తి దర్యాప్తు తర్వాతే ఏం జరిగిందో చెప్పగలం అని పోలీసులు అంటున్నారు.
Bottle of Water: నీటి బాటిల్‌కు రూ. 50 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన వాటర్!