NTV Telugu Site icon

Rain: విషాదం నింపిన వర్షం.. విద్యుత్‌ వైర్లు తెగిపడి కానిస్టేబుల్‌ మృతి

Rain

Rain

Rain: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఈ ఘటనలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సమీపంలో విద్యుత్‌ వైర్లు తెగిపడి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. వీరస్వామి(40) అనే కానిస్టేబుల్ వర్షంలో తడుస్తూ జూబ్లీహిల్స్ మీదుగా బైక్ పై వెళ్తున్నాడు. దీంతో వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు.

Read also: Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్

హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో నివాసముంటున్న సోలెం వీరాస్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9.40 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ఈదురు గాలులతో భారీ వర్షం మొదలైంది. ఈ సమయంలో విద్యుత్ తీగ తెగి వీరాస్వామిపై పడింది. విద్యుదాఘాతానికి గురై బైక్‌పై నుంచి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ గస్తీ పోలీసులు వెంటనే వీరస్వామిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం. యూసఫ్‌గూడ బెటాలియన్‌కు చెందిన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు కుండపోత వర్షంతో నగరం ఒక్కసారిగా నల్లగా మారింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై, కాలనీలో చెట్ల కొమ్మలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Sreya saran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్‌