Site icon NTV Telugu

తెలంగాణకు కేంద్రం శుభవార్త.. మరో 4 జాతీయ రహదారులు మంజూరు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో ఒక దాన్ని నాలుగేళ్ల కిందట, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతులను ఇచ్చింది. వీటికి టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది.

Read Also: తిరుమలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఇరుకుగా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అను గుణంగా.. అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతాల్లో 10 మీట్లర్లు వెడల్పుగా మారనున్నాయి. అంటే.. 248.5 కిలో మీటర్ల పొడువు..10 మీటర్ల వెడల్పుతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీని కోసం ఏకంగా… రూ.2,431 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్ర రవాణా శాఖ. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులను జారీ చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

Exit mobile version