Site icon NTV Telugu

రాష్ర్టానికి కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమి లేదు: కేసీఆర్‌


పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై టీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఎంపీలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రం పై ఒత్తిడితీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్‌ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కృష్ణ జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై పార్లమెంటల్‌లో తెలంగాణ వాణి వినింపించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

విభజన చట్టంలో హామీలను ఇంతవరకు నేరవేర్చ లేదని దానిపై కూడా పార్లమెంట్‌లో ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు. ఈ సారి ఎలాగైనా కేంద్రం విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు తెలిపారు. ఇలా కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన వివిధ అంశాలపై పార్లమెంట్‌లో ఎంపీలు పట్టుబట్టి సాధించుకురావాలని సీఎం కేసీఆర్‌ వారికి వెల్లడించారు.

Exit mobile version