NTV Telugu Site icon

Illicit Relationship: ప్రియురాలిపై మోజు.. 22నెల చిన్నారిని నేలకేసి కొట్టిన ప్రియుడు

Illicit Relationship

Illicit Relationship

Illicit Relationship: అక్రమ సంబంధానికి 22 నెలల పసికందు అడ్డుగా ఉందని నేలకేసి కొట్టి చంపాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన మౌత్క విజయ, సైల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె అరుణ్యకు 4 సంవత్సరాలు, రెండవ కుమార్తె మహాన్వికి 22 నెలలు. నవ్యశ్రీ అత్తగారు గ్రామానికి చెందిన బుల్లింక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి నవ్యశ్రీతో పాటు తన ఇద్దరు పిల్లలను చూసుకుంటానని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో 22 నెలల పాప నిద్రిస్తుండగా, నవ్యశ్రీ తన పెద్ద కూతురు అరుణ్యను తీసుకుని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఇంటికి వచ్చిన అరవింద్ రెడ్డి నిద్రిస్తున్న మహాన్విపై దారుణంగా దాడి చేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

Read also: Salman Khan: కాల్పుల ఘటనపై 150కి పైగా ప్రశ్నలు.. సల్మాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసుకున్న పోలీసులు!

నవ్య శ్రీ ఇంటికి తిరిగి వచ్చేసరికి, మహాన్వి తప్పిపోయింది. నవ్య శ్రీ షాక్ లో ఉండిపోయింది. నాగమణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి రూరల్ సీఐ సురేందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో మహాన్వి నుదిటిపై గాయమైంది. రెండు భుజాలకు చెంపలు, చేతులు, అరికాళ్లు, పిరుదులపై విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో అరవింద్ బాలికను హత్య చేసి పారిపోయాడని తేలడంతో పోలీసులు అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు అరవింద్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నవశ్రీతో అరవింద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీంతో అరవింద్ 22 నెలల మహాన్విపై కోపగించాడని విచారణలో తేలింది. దీంతో అక్రమ సంబంధాన్ని అడ్డుకోవాలనే కారణంతోనే మహాన్విని అరవింత్ విచక్షణారహితంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
Kuwait fire tragedy: భారతీయ కార్మికుల రక్షణకు మోడీ ఆదేశాలు..( వీడియో)