Site icon NTV Telugu

నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం

భాగ్యనగరంలో నేటి నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం, ఆలయకమిటీలు సన్నద్ధమయ్యాయి. మరోవైపు..బోనాల సందర్బంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించారు.ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలు కానుంది. ఇవాళ్టి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

read also : అంతరిక్షంలో తెలుగమ్మాయి.. ప్రయాణం ఈరోజే

జూలై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు, ఆగస్టు 1,2 తేదీల్లో ఓల్డ్‌సిటీ లాల్‌ దర్వాజా మహంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి.. ఆగస్ట్‌ 8న గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్ల రూపాయలు విడుదల చేసింది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


బోనాల పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ .. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు… తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని అభివర్ణించారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో, తెలంగాణ రాష్ట్రం… దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆయన ప్రార్థించారు.

Exit mobile version