NTV Telugu Site icon

Thati Venkateshwar Rao: మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య..

Mahalaxmi

Mahalaxmi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సారపాకలో గల ఇంటిలో తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు మహాలక్ష్మి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంది.. సారపాకలో ఇంటి లో ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు మృత దేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీ నేతలు, కార్యకర్తలు వెంకటేశ్వర్‌రావు ఇంటికి చేరుకుంటున్నారు. మహాలక్ష్మి మృతితో వెంకటేశ్వర్‌ రావు ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.