Site icon NTV Telugu

Hyderabad Central University: ఛీ.. ఛీ కామ ప్రొఫెసర్‌.. విద్యార్థినిపై దారుణం

Hyderabad Central University

Hyderabad Central University

Hyderabad Central University: విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కామంతో కన్నుమూసుకుపోయి విద్యార్థినిపై కామవాంఛతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో జరిగింది. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని ప్రొఫెసర్ నుంచి తప్పించుకుని శనివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read also: Team India: టీమిండియాకు షాక్.. బంగ్లాదేశ్‌ టూర్‌కు స్టార్ బౌలర్ దూరం

దీంతో.. అత్యాచారానికి యత్నించిన ప్రొఫెసర్ రవిరంజన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయని కొందరు అంటున్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. గచ్చిబౌలి పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అత్యాచార యత్నం కేసులో అరెస్ట్ చేస్తారా? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రొఫెసర్ రవిరంజన్‌ను అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే..ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపుతోంది.

ఈఘటనపై మాదాపూర్ డిసిపి శిల్పవల్లి మీడియాతో మాట్లాడారు. హిందీ ప్రొఫెసర్ రవి రాజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. 354 ఐపీసీ కింద కేసు నమోదు చేసామన్నారు. బూక్ కోసం క్యాంపస్ బయటికి పిలిచి అత్యాచారం చేయబోయాడని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ బట్టి సెక్షన్స్ యాడ్ చేస్తుమని డిసిపి స్పష్టం చేశారు.

GOLD: ‘గోల్డ్’లో ‘ప్రేమమ్’ మ్యాజిక్ లేదు

Exit mobile version