NTV Telugu Site icon

Manikrao Thakur: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో థాక్రే పర్యటన

Manik Rao Thakry

Manik Rao Thakry

Thackeray visit to Telangana for three days: నేటి నుంచి మూడు రోజులపాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు వ్యక్తిగత, సామూహిక సమావేశాలు నిర్వహించనున్నారు. టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, సీనియర్ నాయకులకు టీపీసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమావేశాలలో పాల్గొనాలని నాయకులు కోరారు. రేపటి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. థాక్రే తెలంగాణకు రావడం ఇది రెండోసారి. మొదటిసారి హైదరాబాద్ లో అడుగు పెట్టిన థాక్రే తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో వరుస భేటీ అయ్యారు.

Read also: Kamareddy Master Plan: నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం.. నేటి ఆందోళనకు రైతులు బ్రేక్

మొదటిసారి జనవరి 12న రెండు రోజల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన థాక్రే గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని నేతలకు థాక్రే సూచించారు. ప్రతి పబ్లిక్ ఇష్యూను వదలకుండా పోరాటం చేయాలని నేతలకు ఆయన చెప్పారు. సర్కార్ వ్యతిరేకతను పార్టీకి కలిసొచ్చేలా వ్యూహరచన చేయాలని నేతలకు థాక్రే సూచించిన ఆయన ఈగోలతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని సూచించారు. మనమంతా కుటుంబసభ్యులమేనని నేతలకు వివరించిన ఆయన ప్రతి నెల పార్టీలో డెవలప్మెంట్ కనిపించాలని మాణిక్ రావు థాక్రే నేతలకు చెప్పారు. పీఏసీ సమావేశంలో నేతలకు సుతిమెత్తగా థాక్రే హెచ్చరించారు. నేతలంతా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే మీరు గొడవలకు దిగడం మంచిదేనా అంటూ కామెంట్స్ చేశారు థాక్రే.. వివాదాలను పక్కన పెట్టి కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. పీఏసీలో హత్ సే హాత్ జోడోయాత్ర పై సుదీర్ఘంగా నేతలు చర్చించారు. పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు ప్రతీ ఒక్కరూ ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం రెండు నెలల పాటు పాదయాత్ర చేయాలని థాక్రే సూచించారు.
MLA Raja Singh: దానిపై వివరణ ఇవ్వండి.. రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు నోటీసులు

Show comments