TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!

  • TGTET ఇన్‌సర్వీస్ ప్రాథమిక కీ విడుదల
  • సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాలకు ఛాన్స్
  • ఆన్‌లైన్‌లోనే అభ్యంతరాల సమర్పణ
  • గడువు దాటితే స్వీకరించబోమన్న అధికారులు
Tgtet

Tgtet

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET)–ఇన్‌సర్వీస్ టీచర్స్–2026 ప్రాథమిక కీ (Provisional Key) అధికారికంగా విడుదలైంది. ఈ నెల సెప్టెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ సమాధాన పత్రాలను , ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల సమర్పణకు గడువు

విడుదల చేసిన ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని నమోదు చేయడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుందని తెలిపారు.

అభ్యంతరాలను ఎలా సమర్పించాలంటే?

ప్రాథమిక కీలోని సమాధానాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి. అందులోని సంబంధిత అభ్యంతరాల లింక్ (Objection Link) ద్వారా సరైన ఆధారాలతో తమ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే ఎలాంటి దరఖాస్తులను లేదా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.