NTV Telugu Site icon

Group2 Edit Option: గ్రూప్‌-2 అభ్యర్థులు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్..

Tgpsc Group2 Edit Option

Tgpsc Group2 Edit Option

Group2 Edit Option: తెలంగాణ జాబ్ జాతర కొనసాగుతుంది. ఓ వైపు గ్రూప్ 4 పోస్టుల అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఇక మరోవైపు గ్రూప్ 1,2,3 మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ భారీ అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తులో నమోదు చేసిన వివరాలలో తప్పులను సరిదిద్దడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది. ఈ అవకాశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో అధికారులు గ్రూప్-2 విద్యార్థులకు ఈరోజు సాయంత్రం వరకే ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. మళ్లీ ఈ అవకాశం కోసం లింక్ ఓపెన్ చేసిన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

Read also: Bike Thieves: పార్క్ చేసిన వాహనాలే టార్గెట్.. సీసీ కెమెరాలో దృశ్యాలు

గ్రూప్ 2 పరీక్షలు గతేడాది పూర్తి కావాల్సి ఉంది. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024, ఆగస్టు 7 మరియు 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగార్థులు పుస్తకాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నమోదు చేసిన వివరాల్లో తప్పుల సవరణకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. ఈరోజు అంటే జూన్ 20 సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది. అంటే గ్రూప్ 2 అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించేందుకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇంకా తమ వివరాలను సరిదిద్దుకోని వారు వెంటనే సరిచేయాలి. లేదంటే టీజీపీఎస్సీ సవరణకు మరో అవకాశం ఉండదని వెల్లడించింది. ఇప్పటివరకు ఎడిట్ చేయని వారు నేటి ముగింపు సమయానికి ముందే వివరాలను సరిచేయాలని కమిషన్ కోరింది. ఆ తర్వాత పొరపాట్లు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎడిటింగ్ పూర్తయిన తర్వాత పిడిఎఫ్ ఫార్మాట్‌లో అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
JBL Live Beam 3 Price: జేబీఎల్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్‌.. 48 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌!