TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
- డైట్ కాలేజీల్లో 86 లెక్చరర్ ఖాళీలు
- జూన్ 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- పీజీ, ఎం.ఎడ్ అభ్యర్థులకు అవకాశం
- రూ.1.37 లక్షల వరకు ఆకర్షణీయ జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC: తెలంగాణలో కొలువుల జాతర ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో అదిరిపోయే తీపి కబురు అందించింది. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET) కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి కమిషన్ సరికొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఉద్యోగ ఖాళీల వివరాలు
ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని మల్టీజోన్ల వారీగా విభజించగా, మల్టీజోన్-1 పరిధిలో 53 పోస్టులు , మల్టీజోన్-2 పరిధిలో 33 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా, మిగిలిన 63 పోస్టులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ విభాగానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు.
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ముఖ్యమైన తేదీలు , వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు అర్హత , ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 24, 2026 నుండి ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి జూలై 29, 2026 వరకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలని, గరిష్టంగా 44 ఏళ్లకు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
కావాల్సిన విద్యార్హతలు , జీతభత్యాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఎన్సీటీఈ (NCTE) గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 55 శాతం మార్కులతో ఎం.ఈడి (M.Ed) డిగ్రీ కూడా పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతభత్యాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సీనియర్ లెక్చరర్ పోస్టుకు నెలకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు, అలాగే లెక్చరర్ పోస్టుకు నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630 వరకు స్కేల్ ఆఫ్ పే లభిస్తుంది.
దరఖాస్తు చేసుకునే విధానం
అర్హులైన అభ్యర్థులందరూ TGPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు, పరీక్షా విధానం, సిలబస్ , ఇతర సమాచారం కోసం అభ్యర్థులు https://www.tgpsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కమిషన్ కోరింది.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?