TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

  • జూన్ 19 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రారంభం
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కీలక తేదీలు ఇవే
  • వెబ్ ఆప్షన్స్, మాక్ అలాట్‌మెంట్ షెడ్యూల్ వివరాలు
  • జూలై 10న తొలి విడత సీట్ల కేటాయింపు.. ఫీజు చెల్లింపు గడువు
Tg Eapcet

Tg Eapcet

TG EAPCET 2026 : తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ కాలపరిమితిలో తమ ర్యాంకులను బట్టి కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ నుండి సీట్ల కేటాయింపు వరకు ముఖ్యమైన తేదీలు

కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) జరుగుతుంది.

×
×
Ad

సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవడానికి (వెబ్ ఆప్షన్స్) అవకాశం ఉంటుంది. విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా వచ్చే నెల 4వ తేదీన ‘మాక్ సీట్ అలాట్‌మెంట్’ (నమూనా సీట్ల కేటాయింపు) ప్రక్రియను నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులకు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనా వస్తుంది.

ఆప్షన్ల మార్పు, ఫీజు చెల్లింపు గడువు

మాక్ అలాట్‌మెంట్ చూసుకున్న తర్వాత, విద్యార్థులు తాము పెట్టిన వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మార్చుకునేందుకు (మోడిఫికేషన్) ప్రత్యేక అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత, వచ్చే నెల 10వ తేదీన మొదటి విడత అధికారిక సీట్ల కేటాయింపును పూర్తి చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 10వ తేదీ నుండి 14వ తేదీ లోపు నిర్దేశిత ట్యూషన్ ఫీజును చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.