Site icon NTV Telugu

Kamareddy Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేట్ వద్ద టాటా ఏస్, లారీ ఢీ కొన్నాయి. దీంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందగా, ఎల్లారెడ్డి లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే.. మృతులు పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఎల్లారెడ్డిలో బంధువుల దశదినకర్మకు హాజరై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
సంఘటన స్థలంలో డ్రైవర్ సాయిలు(35), హంసవ్వ, లచవ్వ(77) మృతి చెందగా.. బాన్సువాడ తరలిస్తుండగా దేవయ్య, కేశయ్య, ఎల్లారెడ్డి లో చికిత్స పొందుతూ అంజవ్వ(35) మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version