Site icon NTV Telugu

Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ లో దాడి ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

Adilabad Rims Students

Adilabad Rims Students

Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ లో దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండో రోజుకూడా విధులను బహిష్కరించి జూడాలు నిరసన తెలిపారు. అయితే ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య విద్యార్థులపై దాడి చేయడానికి వచ్చిన వారు డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ పంపిస్తే వచ్చామని ఉన్న ఆడియో వీడియోను రిమ్స్ వైద్య విద్యార్థులు బయట పెట్టారు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు. సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టిన అధికారులు స్పందించరా? అని మండిపడుతున్నారు. డైరెక్టర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి, రిమ్స్ డెరైక్టర్ రాథోడ్ జై సింగ్ లైసెన్స్ లను రద్దు చేయాలని వైద్య విద్యార్థుల ఆందోళన చేపట్టారు. రిమ్స్ లో జూడాల ఆందోళన కొనసాగుతుంది. అయితే ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య విద్యార్థులను శాంతింప చేసే పనిలో పడ్డారు. అయినా జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ లో కమిటి విచారణ ముగిసింది. రేపు నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని టీం ప్రొఫెసర్ శివ ప్రసాద్ అన్నారు.

Read also: Kishan Reddy: ఒంటరిగానే పోటీ చేస్తాం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మించి సీట్లు పొందుతాం

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం వైద్య విద్యార్థులకు, దుండగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వైట్ కలర్ క్రెటా, బండ్లపై వచ్చిన దుండగులు వైద్య విద్యార్థులను దారుణంగా కొట్టారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న ఉదయం నుంచి విధులను నిలిపివేశారు. అత్యవసర సేవలు తప్పా మిగతా సేవలకు హాజరు కాబోమని వెల్లడించారు. ఇప్పటికే వైద్య విద్యార్థుల పై దాడి చేసిన వారి లో 5 మంది రిమాండ్ కు తరలించారు పోలీసులు. డైరెక్టర్ పైనా కేసు నమోదు చేసిన పోలీసులు. రౌడీ షీటర్ లతో రిమ్స్ హాస్టల్స్ ఆవరణ లోకి వెళ్ళి దాడి చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను ఉన్నతాధికారులు టర్మినెట్ చేసారు.
Fighter: “షేర్ కుల్ గయ” సాంగ్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు

Exit mobile version