Site icon NTV Telugu

Telangana Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

Assembly Media Point Ktr Harish Rao

Assembly Media Point Ktr Harish Rao

Telangana Assembly: అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మీడియా పాయింట్‌ వద్దకు బీఆర్ఎస్‌ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే వున్న పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.కాగా.. పోలీసులకు బీఆర్ఎస్ సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు ఎందుకు వెళ్లకూడదు అంటూ కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాదించారు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధనలు వున్నాయన్నారు పోలీసులు. ఎప్పుడులేని కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం చేశారు. అయినా బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులకు, పోలీసులకు తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడే బీఆర్ఎస్ సభ్యులు నేలపై కూర్చొని నిరసనలు తెలిపారు.

Read also: Bengal Governor: బెంగాల్ గవర్నర్ కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు..

మరోవైపు అసెంబ్లీలో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చేశారు. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్, సీపీఐ, ఏఐఎం ఎమ్మెల్యేలు సందర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆహ్వానించారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ హాజరుకాలేదు. కాగా నేడు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీఎం రేవంత్‌ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన, సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేయగా, సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

Read also: Elon Musk : టెస్లా కార్ల కంటే ముందే మస్క్ ఇండియాలోకి ఎంట్రీ.. ఆ వెంచర్ పార్టనర్ కోసం ప్రయత్నాలు

మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ భాష సరైనదేనా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మనం దాని గురించి చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు. ఇదేనా తెలంగాణ సంప్రదాయం? అని నిలదీశాడు. గుంతలా పడిపోయిన బీఆర్‌ఎస్‌కు బుద్ది రాలేదు. అని నిలదీశాడు. చర్చకు రావాలంటే పారిపోయారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం తీరును నిరసిస్తూ వారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్‌కు ఆసక్తి లేదు.. సభ నుంచి ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా విమర్శించారు. దీంతో వాకౌట్ చేసి బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు సభ జరుగుతుండగానే మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Bandla Ganesh : మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

Exit mobile version