Site icon NTV Telugu

Tension at Gandhi Bhavan: గాంధీభవన్‌ వద్ద ఉద్రికత.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్

Tension At Gandhi Bhavan

Tension At Gandhi Bhavan

Tension at Gandhi Bhavan: గాందీభవన్‌ వద్ద ఉద్రక్త పరిస్థితి నెలకొంది. నూతన సచివాలయానికి బయలుదేరిన టీ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. ఈనేపథ్యంలోనే కొత్త సచివాలయాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అక్కడికి ఎవరూ వెళ్లేందుకు దారులన్నీ బంద్‌ చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు కొత్త సెక్రటేరియట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణ జరగాలంటూ అక్కడకు వెళుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాదోపవాదాలు జరిగాయి.

Read also: Krishnam Raju Wife: విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది – కృష్ణం రాజు సతీమణి

అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణ చేప్పాలని నిరసనకు దిగేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లురవి, షబ్బీర్ అలీలను కూడా గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర సీఎం కేసీఆర్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీభవన్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎదురుగా వున్న గేట్లను తోసుకుని ముందుకు వెల్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు , కాంగ్రెస్ నాయకులకు ఎదురుఎదురుగా నిలబడి గేట్ల తోసేందుకు ప్రయత్నించగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ ముఖ్య నేతలు అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులో తీసుకున్న వారిని గోషా మహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Read also: Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం జరగనున్న కొత్త సెక్రటేరియట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం ఈ ఘటనను ‘మాక్ డ్రిల్’గా పేర్కొంటూ మూకుమ్మడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. సచివాలయానికి రాకుండా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గాంధీభవన్‌లో అరెస్టు చేశారని మహ్మద్ అలీ షబ్బీర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇలాఉంటే.. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. కానీ.. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు.. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.
Allola Indrakaran Reddy: నాందేడ్ లో సీయం కేసీఆర్ స‌భ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

Exit mobile version