NTV Telugu Site icon

Quick Pregnancy : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఏం చెయ్యాలి? ఏ టైం లో కలవాలి?

Quick Pregnancy

Quick Pregnancy

పెళ్ళైన దంపతులకు సంతానం కలగకపోతే వారి బాధ అంతా ఇంతా కాదు. జీవనశైలిలో మార్పులు, ఆలస్యంగా జరిగే వివాహాలు, తగినంత పోషకాహారలోపం, మహిళల్లో రుతుక్రమం సమస్యలు, మగవారిలో లైంగిక సమస్యలు.. ఇలా అనేక కారణాల వలన సంతాన లేమి సమస్యలతో సతమతమవుతున్నారు. గర్భవతి అవ్వాలనుకునే మహిళలకు నెలల తరబడి వేచి ఉండటం చాలా అసహనం అనిపిస్తుంది. ఎంత త్వరగా గర్భవతి అయిపోదామా అనిపిస్తుంది. మరి త్వరగా గర్భం ధరించడం కోసం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Also Read : Ramya: సమంత నుంచి దీపికా పదుకొణే వరకు ఇలాగే చేస్తున్నారు.. పఠాన్ మూవీపై స్టార్ హీరోయిన్ కామెంట్స్

ముఖ్యంగా మహిళలు తమ నెలసరి ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో పరిశీలించుకోండి. గర్భం రావాలంటే ఆరోగ్యవంతమైన ఋతుచక్రం చాలా ముఖ్యం. రుతుక్రమం సక్రమంగా రావడానికి బలమైన ఆహారం తీసుకోండి. ఉదాహరణకు నెలసరి ఒకటవ తారీఖున ఐతే పన్నెండు రోజుల నుండి పదహారు రోజుల లోపు అండం విడుదలవుతుంది. ఈ సమయం ఫలదీకరణకు చాలా ఉత్తమం. ఈ సమయంలో వీలైనన్ని ఎక్కువ సార్లు మీ భాగస్వామితో రతి చేసేందుకు మీరు ఉత్సాహం చూపండి.
Also Read : ఇలాంటి సమయంలో సెక్స్ చేయకూడదు.. లేకపోతే ప్రాణాలు పోతాయ్..!

ప్రతిరోజు రతి చేస్తే వీర్యం నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి రెండు రోజులకొకసారి రతి ఆచరించండి. వీర్యాన్ని లోతుగా గర్భ ద్వారం వద్ద పడేలా స్కలనం చేయమని మీ భాగస్వామికి సూచించండి. వీర్యం స్కలించిన తరువాత వెంటనే అంగాన్ని తీయకుండా కొద్దిసేపు యోని లోనే ఉంచమని చెప్పండి. అలాగే అంగం యోని లోపలకి బాగా ప్రవేశించే రతి భంగిమలను ఆచరించండి. అంగం బాగా చోచ్చుకుని పోతే గర్భం రావడం చాలా తేలిక అవుతుంది. గర్భం రావడం అనేది శరీరంలో జరిగే రక్త ప్రసరణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల రక్త ప్రసరణ బాగా జరిగే ఆహారాన్ని తీసుకొండి.
Also Read : Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినండి..!
వీటితోపాటు విటమిన్ సి అధికంగా లభించే పండ్లను తీసుకోండి. సంతాన ఉత్పత్తిని పెంచడంలో పాలు మరియు పాల ఉత్పత్తులు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి. స్త్రీ మరియు పురుషులలో సంతానోత్పత్తి పెంచటంలో దానిమ్మ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది మహిళల గర్భాశయానికి మరియు లోపల పొరకు రక్తప్రసరణను పెంచుతుంది. మరియు పురుషుల్లో నాణ్యమైన వీర్యకణాల వృద్ధికి సహాయపడుతుంది.