NTV Telugu Site icon

Summer Holidays: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. నేటి నుంచి వేసవి సెలవులు..

Summer Holidyes

Summer Holidyes

Summer Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్తను విద్యాశాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులను నేటితో ప్రారంభం కానున్నాయని ప్రకటన జారీ చేసింది. ఇవాల్టి నుంచి 50 రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వన్ డే స్కూల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే… తెలంగాణలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభంకాగా నిన్నటితో ముగిసాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు నేటి నుంచి జూన్ వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు సోమవారం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. నేటి నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: TS Inter Results 2024: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

ఇక ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 30 నుండి మే 31 వరకు ఉంటాయని తెలిపింది. అంటే వారు సుమారు రెండు నెలల పాటు సెలవులు ఆనందించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. ఇక ఏపీలో కూడా నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు ప్రారంభమయ్యాయి. మే 31 వరకు ఇవి కొనసాగనున్నాయి.జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలకు ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జూన్ మూడో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే.. పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉందని, అప్పటి పరిస్థితిని బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
Supreme Court: వీవీప్యాట్ లపై నమోదైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ