Site icon NTV Telugu

Wines Tender : ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు.. ఇంకా రెండు రోజులే గడువు

Wines Shop

Wines Shop

Wines Tender : తెలంగాణలో వైన్‌ షాపుల టెండర్లకు ఈసారి అంచనాలకు మించి స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,620 మద్యం షాపుల కేటాయింపుకు ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో కేవలం ఒక్కరోజులోనే దాదాపు 10 వేల దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వంకు భారీ ఆదాయం చేరింది.

Wife: పాపం రా.. అనారోగ్యం ఉందని చెప్పకుండా తనకిచ్చి పెళ్లి చేశారని.. కట్టుకున్న భార్యను

ఇప్పటివరకు మొత్తం 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. టెండర్‌ సమర్పణకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో, చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో చివరి రెండు రోజుల్లో భారీ స్పందన నమోదై, 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చిన విషయం గుర్తుచేసుకున్నారు.

ఈసారి కూడా అదే రీతిలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త లైసెన్సుల కేటాయింపుతోపాటు, ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ టెండర్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. చివరి తేదీ సమీపిస్తుండటంతో మద్యం వ్యాపార వర్గాలు దరఖాస్తుల సమర్పణలో చురుకుగా పాల్గొంటున్నాయి.

Cyber Fraud: సందర్భమేదైనా.. సైబర్‌ నేరగాళ్ల ఎంట్రీ.. రెండు రోజుల్లో ఏకంగా 400 మందిని మోసం

Exit mobile version