తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ నిన్న (గురువారం) పేర్కొంది. ఇక జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. అయితే.. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు వాగులను తలపించాయి. ఇక.. కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలో 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిన్న (గురువారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 6.8 సెం.మీ, నిర్మల్ జిల్లా పెంబిలో 6.4, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి.
భారీ వర్షాలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుండడంతో.. వాహనదారులు ముందుకు కదలాలంటేనే వణికిపోతున్నారు.. దీంతో.. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది.. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికస్తున్నారు.
Rajastan: ఒకటవ ఏట పెళ్లి.. 20 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసిన కోర్టు