NTV Telugu Site icon

Weather Update: తెలంగాణలో అత్యధిక చలి.. ప్రజలు అలర్ట్‌ గా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hyderabad Wether

Hyderabad Wether

Weather Update: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో చలి ఎక్కువగా నమోదవుతోంది. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా చలి గాలులు పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండగా, పగటిపూట ఎండ ఉంటుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది.

Read also: Hyderabad Petrol Bunks: పెట్రోల్‌ పై మళ్లీ పుకార్లు.. బంకుల్లో జనం క్యూ..

తెలంగాణలో చలి ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉదయం పూట పొగమంచు కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28.4 డిగ్రీలు, 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఉపరితల గాలులు ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది. గాలి తేమ 84 శాతంగా నమోదైంది.
Maldives President: భారత పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడి ప్రణాళికలు