Site icon NTV Telugu

Rains in Telangana: అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

Varsham

Varsham

న‌గ‌రానికి నైరుతి రుతుప‌వ‌నాలు ప‌ల‌క‌రించాయి. నిన్నటి నుంచే న‌గరమంతా చ‌ల్ల‌బ‌డింది. అర్థ‌రాత్రి తొల‌క‌రి జ‌ల్లుల‌తో భాగ్య‌న‌గం త‌డిసింది. ఇన్ని రోజుల నుంచి ఉక్క‌పోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జ‌నాల‌కు వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టంతో .. ఊరిపి పీల్చుకున్నారు. రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు ఇదే వాతావ‌ర‌ణం క‌నిపించ‌నుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, రాబోవు మూడు రోజుల వరకు భారీ వర్ష సూచనల నేపద్యంలో జోనల్, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పై సమీక్షా నిర్వహించారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్లపై, రోడ్లపై, గృహాలపై విద్యుత్ తీగలు తెగి పడ్డట్లు ఉంటే వాటికి దూరంగా ఉండి, వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకురాగలరని తెలిపారు.

రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదని అన్నారు. సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామ‌న్నారు.

విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల‌న్నారు. సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సమస్యలు సంస్థ దృష్టికి తీసుకురాగలరని రఘుమా రెడ్డి సూచించారు.

Chhattisgarh: బోరు బావిలో బాలుడు.. 60 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

Exit mobile version