HSRP Number Plate : పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) బిగించేందుకు ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. “సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా HSRP నంబర్ ప్లేట్ అమర్చకపోతే జరిమానాలు విధిస్తారు” అనే వార్తలు వాస్తవం కాదని స్పష్టంచేసింది. HSRP నంబర్ ప్లేట్ల గడువు విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని, ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని రవాణా శాఖ ప్రకటించింది.
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం తేదీలో మార్పు.. ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసేది అప్పుడే..?
కాబట్టి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. HSRP నంబర్ ప్లేట్లు అమర్చుతామని కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు ప్రచారం చేస్తున్నాయని రవాణా శాఖ హెచ్చరించింది. వాటిని నమ్మరాదని, అధికారిక ఛానెల్‌ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ఆర్టీఏ చలాన్ల పేరుతో అనుమానాస్పద లింకులు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మోసపూరిత లింకులు వ్యక్తిగత డేటా దొంగతనానికి కారణమవుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.
