Site icon NTV Telugu

Telangana : తెలంగాణలో రవాణా శాఖ చెక్‌పోస్టుల తొలగింపు

Rto Check Post

Rto Check Post

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న 14 బార్డర్ చెక్‌పోస్టులు, కామారెడ్డి జిల్లాలోని మరో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ను పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఇప్పటివరకు బార్డర్ ప్రాంతాల్లో వాహనాలు ఆగి తనిఖీలు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీని వలన సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు ఆలస్యం కావడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం లాంటి సమస్యలు ఎదురయ్యేవి.

 YS Jagan: సినిమాలు, సీరియళ్లను మించి ప్రకటనలు చేసి.. ఇప్పుడు మోసం చేస్తారా?

చెక్‌పోస్టులు తొలగించడం ద్వారా ఈ ఇబ్బందులకు ముగింపు లభించనుంది. రవాణా శాఖ వర్గాల సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ఇ-టెక్నాలజీ ఆధారంగా వాహనాల తనిఖీలు, పన్నులు వసూలు చేసే విధానాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. ప్రత్యేకంగా జీపీఎస్‌ ఆధారిత మానిటరింగ్, ఆన్‌లైన్ ట్యాక్స్ చెల్లింపు, సిసిటివి ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేస్తూ పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చెక్‌పోస్టులు తొలగించడం వాహన యజమానులు, వ్యాపార వర్గాలు, ట్రాన్స్‌పోర్టర్లలో సానుకూలతను తీసుకొస్తోంది. వాణిజ్య రంగానికి ఇది ఉపశమనంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

HYDRA : హైడ్రాను అభినందించిన హైకోర్టు.. ప్రజా ఆస్తులను కాపాడడానికి హైడ్రా అవసరమంటూ కితాబు

Exit mobile version