Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్ష సూచన
- గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు
- రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
- మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర , తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంద ని తెలిపింది. ఈ నేపథ్యంలో సదరు జిల్లాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వర్ష సూచన ఉన్న జిల్లాల్లో గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వేగవంతమైన గాలుల వల్ల బలహీనమైన నిర్మాణాలు, చెట్ల కొమ్మలు , విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు
వర్ష ప్రభావం ఉన్న జిల్లాలు మినహా, తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుందని వాతావరణ నివేదిక పేర్కొంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా మబ్బులు క్రముకుని వచ్చి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నప్పటికీ, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!