Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana State Won Ease Of Doing Business Award 2022

Ease Of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు

Published Date :August 25, 2022 , 9:45 pm
By NTV WebDesk
Ease Of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Telangana State Won Ease Of Doing Business Award 2022: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు దక్కింది. ‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా.. ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఈ అవార్డ్‌ని ప్రసాదించింది. గురువారం న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన డిజిటెక్‌ కాంక్లేవ్ 2022లో.. ఈ అవార్డును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం(ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ఆ మేగజైన్ ప్రశంసించింది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తోన్న సంస్కరణలతో పాటు.. ‘మీ సేవ’ పోర్టల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నారని కొనియాడింది.

ఈ సంధర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పుల గురించి, ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్‌లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టీ-వాలెట్ సాధించిన మైలురాళ్ల గురించి వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, అలాగే టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తుల అనుమతుల్ని.. వరుసగా 15, 21 రోజుల్లో పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉందన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారం మరో నిదర్శనమన్నారు. ఇదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన పరిశోధన చేసిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read

  • Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Digital Services
  • Ease Of Doing Business Awards 2022
  • Economic Times
  • Telangana Mee Seva
  • telangana state

తాజావార్తలు

  • Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!

  • Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..

  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..

  • Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..

  • PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions