D. Sridhar Babu: ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్.. జాబ్ మేళా ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Sridhar Babu: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా… 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Read also: Saim Ayub Shot: సయీమ్ ఆయుబ్ వీరవిహారం.. ఈ సిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్
Also Read
- Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
- CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
- Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శమని తెలిపారు. యువ వయసులో మంచి విద్య , ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించాలన్న భావతతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పషఖటం చేశారు. గత పదేళ్లలో ఒక దశాదిశ లేకుండా రాష్ట్రం నడిచిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. యువత కూడా ఒక లక్ష్యం తో ముందుకు వెళ్లాలని, వివేకానంద స్ఫూర్తి తో లక్ష్య సాధన లో విజయం సాధించాలని ఆశిస్తున్నానన్నారు. గ్రామీణ ప్రాంతంలో యువత పెడదారిపట్టే దారులునున్నాయని, కాబట్టి మాదక ద్రవ్యాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అనే మాటవినిపిం చొద్దు అని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలోని మరిన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన లో ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రం లో స్కిల్ సెంటర్ , స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన, వాటికి కావాల్సిన నైపుణ్యాన్ని వెలికతీసేందుకు స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని తేల్చిచెప్పారు.
Read also: Mallanna Jatara: రేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర.. ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభం
“మాది ప్రజల ప్రభుత్వం. భాష విషయంలో బాధ పదద్దు. స్కిల్ యూనివర్సిటీస్ ద్వారా మీకు అందులో ప్రావీణ్యం లభిస్తుంది. మీ ప్రతిభ బయటకు వస్తుంది .. మేము మీ కోసమే పని చేస్తున్నం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ను మోటివెట్ చేసి ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ప్రత్యేక నిధులు ఏర్పాటు తో వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాము”అని యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్టిఫషియల్ ఇంటెలిజెన్స్ లో డిగ్రీ చదువుకన్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తెబోతున్నమమని, ఆ రంగం లో కూడా యువతకి ఉపాధి తో పాటు రాష్ట్ర అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. సానుకూల దృక్పథంతో యువత ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా జాబ్ మేళ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాగా35 వేల మందికి ఇప్పటికే పలు జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు అందించినట్టు యూత్ సర్వీస్ విభాగం అధికారులు మంత్రికి తెలియజేశారు. మేళ లో ఉద్యోగం కోసం వచ్చిన యువతతో మంత్రి ప్రత్యేకంగా కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Minister RK Roja: చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి రోజా.. పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రికి బీజేపీ..!
తాజావార్తలు
-
Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
-
Sam Pitroda Praises PM Modi: ప్రధాని మోడీపై సామ్ పిట్రోడా ప్రశంసలు.. ‘దయగల, కష్టపడే వ్యక్తి’ అంటూ కీలక వ్యాఖ్యలు
-
AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
PM Modi: 2047 డెడ్‌లైన్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.. మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!