TG SET-2025 : తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG-SET 2025) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. TG-SET 2025 పరీక్ష డిసెంబర్ 2025 రెండో వారం లో జరగనుంది. TG-SET 2025 పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్ లో నిర్వహించబడుతుంది. పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది, Paper I లో 50 ప్రశ్నలు, Paper II లో 100 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం మార్కులు 300. ప్రతి పేపర్ కోసం 3 గంటల సమయం కేటాయించబడుతుంది.
Top Headline @5PM : టాప్ న్యూస్
Paper I, Paper II రెండింటిలోనూ అభ్యర్థులు అర్హత సాధించాలి, CBT మోడ్‌కు అనుగుణంగా సమగ్ర ప్రిపరేషన్ అత్యంత అవసరం. TG-SET 2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం 10 అక్టోబర్ 2025 నుండి అందుబాటులో ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా Osmania University అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in లోనూ పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు సమయాన్ని గమనించి, సకాలంలో ఫారం పూర్తి చేసుకోవాలి.
