భారత్‌కు విద్యుత్ గండం..! తెలంగాణ మాత్రం సేఫ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా పెద్ద సంక్షోభంలో పడిపోయింది… తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడిపోతోంది.. అయితే, ఇప్పుడు భారత్‌కు కూడా విద్యుత్ ఉత్పత్తి, కరెంట్ కోతల ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఈ పరిస్థితి దాపురిస్తోందని భయాలు వెంటాడుతున్నాయి.. మరి, తెలంగాణలో పరిస్థితి ఏంటి..? అనే చర్చ మొదలైంది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.. దేశంలోనే సేఫ్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణగా వెల్లడించారు. సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్ రావు తీసుకున్న నిర్ణయంతో మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకి ఎలాంటి ఆటంకాలు లేవని.. హైడల్ పవర్ లో దేశంలో ఎక్కడ లేనివిధంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణగా క్లారిటీ ఇచ్చారు. హైడల్ పవర్ ఉత్పత్తి లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంటంకం వచ్చేదన్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇవాళ హైడల్ పవర్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని వివరించింది విద్యుత్‌శాఖ.. ఇక, థర్మల్ విద్యుత్ లోను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది జెన్కో… 15 రోజుల వరకు సరిపోను బొగ్గు నిల్వలు ఉన్నాయని.. గ్రిడ్ ఆపరేషన్ బాగా వర్క్ చేస్తుందని తెలిపారు. మరోవైపు ఉత్తర భారతదేశంలో కోల్ సమస్య బాగా ఉంది.. కోల్ సమస్యల వల్ల గ్రిడ్ కుప్పకూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించిన అధికారులు.. గ్రిడ్ ఫెయిల్ అయితే దాదాపు 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, దసరా పండుగకు ముందు ఉత్తర భారత దేశంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. విద్యుత్ కోతలు పెట్టకపోతే గ్రిడ్ కుప్పకూలే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.. రానున్న వారం పది రోజుల్లో ఉత్తర భారతం చీకట్లో మగ్గే అవకాశం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలు సీఈఏ గైడ్ లైన్స్ పాటించకపోవడమే ఈ బొగ్గు నిల్వలు తగ్గుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు అధికారులు.
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!