నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గాడిలో పెట్టేందుకు సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌ను రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్.. ఆయనను ఆర్టీసీ ఎండీగా నియమించిన విషయం తెలిసిందే.. ఇక, సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. క్రమంగా ఆర్టీసీని లాభాల పట్టిస్తున్నారు.. సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణం చేస్తూ వారి కష్టాలు తెలుసుకుని.. తదనుగుణంగా బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్న సజ్జనార్.. అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు.. న్యూ ఇయర్ వేడకల నుంచి సమ్మక సారక్క జాతర వరకు ప్రత్యేక బస్సులు నడిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సజ్జనార్.. ఆర్టీసీని రూపొందించిన వీడియోలను షేర్ చేస్తుంటారు.. ఇక, సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీని కూడా వదిలిపెట్టలేదు సజ్జనార్.. అది కూడా ఆర్టీసీ కూడా వాడేశారు.
Read Also: Crude Oil Price: దిగి వస్తున్న చమురు ధరలు..
‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఆర్టీసీ ప్రచారానికి వాడేశారు సజ్జనార్.. ఆర్ఆర్ఆర్ అంటే.. ‘రౌద్రం.. రణం.. రుధిరం’గా చెక్కారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. కానీ.. దాని అర్థాన్ని కూడా పూర్తిగా మార్చేసి కొత్త భాష్యం చెప్పారు సజ్జనార్… ఆర్‌ఆర్‌ఆర్‌ను.. ‘రాష్ట్ర.. రోడ్డు.. రవాణా..”గా మార్చేశారు.. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ నుంచి విడుదలైన ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ సాంగ్‌ని ఆర్టీసీ ప్రచారానికి వాడేసిన ఆయన.. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పట్టుకున్న జెండాపై ‘వందేమాతరం’ అని ఉండగా సజ్జనార్ మాత్రం వాటి స్థానంలో టీఎస్ఆర్‌టీసీ అని రాయించారు.. దాని కింద బస్సు, లోగో వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.. మొత్తంగా సజ్జనార్, ఆర్టీసీ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు నెటిజన్లు..
