Site icon NTV Telugu

స‌జ్జ‌నార్ బంప‌రాఫ‌ర్‌.. మీ ఇంటి వ‌ద్ద‌కే మేడారం స్పెష‌ల్ బ‌స్సు..!

ఆసియాలోనే అతిపెద్ద సంబ‌రం.. మేడారం జాత‌ర‌కు తెలంగాణ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతుంది.. ప్రైవేట్ వాహ‌నంలో వెళ్తే ఎక్క‌డో 5, 6 కిలోమీట‌ర్ల దూరంలో దిగాల్సి ఉంటుంది.. కానీ, ఆర్టీసీ బ‌స్సులు నేరుగా స‌మ్మ‌క‌, సార‌క్క గ‌ద్దెల ద‌గ్గ‌ర వ‌ర‌కు వెళ్తాయి.. దీంతో.. భ‌క్తులు ఇబ్బందులు పాడాల్సిన అవ‌స‌రం ఉండ‌డు.. మేడారం జాతర కోసం ప్ర‌త్యేకంగా 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఇబ్బందుల‌కు గురికాకుండా.. ఈ బ‌స్సు స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

Read Also: మేం గెలిస్తే.. రూ.500లోపే గ్యాస్ సిలిండ‌ర్ అందిస్తాం..!

ఇక‌, మేడారం జాత‌ర సంద‌ర్భంగా భ‌క్తుల‌కు బంప‌రాఫ‌ర్ కూడా ఇచ్చారు స‌జ్జ‌నార్.. 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే ఆర్టీసీ బ‌స్సు వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.. అలాంటి వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేసి.. స‌మాచారం ఇస్తే.. బ‌స్సు మీరు ఉన్న‌చోటుకే పంపిస్తామ‌ని తెలిపారు.. మ‌రోవైపు, మేడారంలో 50 ఎకరాల్లో బేస్‌ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు స‌జ్జ‌నార్.. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్‌ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివ‌రాల‌ను అన్నీ.. కిట్స్ కాలేజీ స్టూడెంట్స్ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో పొందుప‌ర్చిన‌ట్టు తెలిపారు.

Exit mobile version