Site icon NTV Telugu

తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం

సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చింది. పండుగ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా… వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు ఛార్జీలు ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేయకుండానే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ ఆర్టీసీ అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా 4 వేల బస్సులను సంస్థ నడిపింది.

Read Also: ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలింపు

అంతే కాదు ఏకంగా రూ. 107 కోట్ల ఆదాయం రాబట్టింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తరపున ప్రయాణికులకు కృత జ్ఞతలు తెలిపారు. ముందు ముందు కూడా ఇలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రయాణికులు ఆదరించాలని కోరారు. కాగా పండుగకు ముందే ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపిన సంగతి తెల్సిందే.

Exit mobile version