NTV Telugu Site icon

TS Rajiv Arogyasri Scheme: తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్.. పూర్తి వివరాలివే..

Telangana Arogya Sceem

Telangana Arogya Sceem

TS Rajiv Arogyasri Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలు అమలులోకి వచ్చాయి. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా.. సభా ప్రాంగణంలో చేయూతతోపాటు మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Read also: Deol Family: ఈ ఇయర్ బెస్ట్ కంబ్యాక్ అంటే వీళ్లదే…

ఆరోగ్య శ్రీ పథకం పూర్తి వివరాలు..

* ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులు రూ.10 లక్షలకు పెంపు
* రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నేటి నుంచి అమలు
* 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు
* గతంలో ఆరోగ్యశ్రీ రేంజ్ 5 లక్షలు మాత్రమే
* నేటి నుంచి ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు చికిత్స అందుబాటులో ఉంది
* రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు
* రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు
* 293 ప్రైవేటు ఆసుపత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
* ఆరోగ్యశ్రీ కింద 1,376 ఆపరేషన్లు, 289 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి
RGV : యానిమల్ మూవీని రణ్ బీర్ కాకుంటే ఆ హీరో మాత్రమే చేయగలడు..