NTV Telugu Site icon

Telangana Rains: తెలంగాణను వీడని వానలు. నేడు భారీ వర్షాలు

Telangana Rains

Telangana Rains

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. వరణుడు తెలంగాణను కనకరించడంలేదు. రెండు రోజులు సాధారణంగా జల్లులు కురవడంతో.. తగ్గుముఖం పడ్డాయి అనుకున్న క్రమంలో వానలు మళ్ళీ మొదలయ్యాయి. అయితే నేడు పలు చోట్లు భారీ వానలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రజలకు చేదు వార్త తెలిపింది. ఈనేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలిపింది. అవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదని ప్రకటించింది.

read also: Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

అయితే అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమిపైకి వచ్చిందని ఇది కాస్త సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైందని వాతావరణశాఖ పేర్కొంది. వానల నేపథ్యంలో దీనికి తోడుగా గాలులతో కూడిన ఉపరిత ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో.. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీనికారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వానలు కురిసే అవకాశం వుందని, ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని తెలిపింది. ముప్పు ప్రాంతాల ప్రజలకు కాస్త జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.