NTV Telugu Site icon

Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్డేట్.. సెప్టెంబర్ 2 తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్

Talangana Rains

Talangana Rains

Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ లేకుండా పోయింది. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. జూన్ నెలలో వర్షాలు సరిగా కురవలేదు. దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదైంది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.

1972 ఆగస్టు తర్వాత తెలంగాణలో అత్యల్ప వర్షపాతం ఈ ఏడాది ఆగస్టులో నమోదైందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం ఆగస్టులో రాష్ట్రంలో సగటు వర్షపాతం 74.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 1972లో 83.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఆగస్టులో 74.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2 తర్వాత తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వెల్లడించింది. అయితే ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది.
BRS Leaders: నేడు మార్కండేయ రథోత్సవం.. హరీష్‌ రావు నేతృత్వంలో షోలాపూర్‌ కు బీఆర్‌ఎస్‌