Site icon NTV Telugu

Telangana Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

Rains Hyderabad

Rains Hyderabad

తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు.. వర్షాలు ఆగాయి కదా అని ఊపిరి పీల్చుకొనేలోపు ఇప్పుడు మరో బాంబ్ లాంటి వార్తను అధికారులు చెప్పారు..ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండొచ్చని ప్రకటించింది.. దీంతో జనాలు భయపడుతున్నారు.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీమ్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు… హనుమకొండ, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..

అలాగే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.. వర్షంతో పాటుగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.. మొత్తం మీద కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ తోపాటు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు కుండపోత వానలు, ఇంకోవైపు ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుత్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ దగ్గర అదే ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ అండ్ ఔట్‌ ఫ్లో కొనసాగుతుంది..

ఎటు చూసిన నిండుకుండలా మారిన హుస్సేన్‌ సాగర్‌కు కూడా వరద నీరు పోటెత్తుతోంది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ను దాటేసి డేంజర్‌ లెవల్‌కి చేరింది సాగర్‌ నీటిమట్టం. హుస్సేన్‌సాగర్‌ కెపాసిటీ 513.41 మీటర్లు అయితే ప్రస్తుతం 514.75 మీటర్లపైనే ఉంది. దాంతో మూడు తూముల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.. 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్‌ మహా నగరానికి కూడా ఆరెంజ్‌ వార్నింగ్‌ అలాగే ఉంది.. అందుకే అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

Exit mobile version