Weather Updates : తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఎండలు ఉక్కపోతతో చికాకుపడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరటను కలిగించనుంది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైన నేపథ్యంలో, ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించనుంది. రేపు (గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా శుక్రవారం రోజు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీవర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశమున్నట్లు అంచనా వేయబడింది.
PV Sindhu: కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!
ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని, ప్రజలు అజాగ్రత్తగా బయట ఉండరాదని హెచ్చరించింది. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండేలా ఉండటంతో ప్రజలు భద్రతతో ఉండాలని సూచించింది.
హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్ష సూచన ఉంది. ఈదురుగాలులు గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
