Site icon NTV Telugu

Telangana Weather : తెలంగాణలో 24 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Tg Rains

Tg Rains

Telangana Weather : తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Rekha Gupta: భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్‌పై రేఖా గుప్తా ఆగ్రహం

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే.. నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రత్యేకంగా అమీర్‌పేట, పంజాగుట్ట, పాతబస్తీ వంటి ప్రాంతాల్లో రహదారులపై నీరు నిల్వవడంతో వాహనదారులు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరింది. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ?

Exit mobile version