Site icon NTV Telugu

Private Colleges : చర్చలు సఫలం.. రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు

Bhatti

Bhatti

Private Colleges : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు శుక్రవారం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రభుత్వ హామీతో సంతృప్తి చెందిన యాజమాన్యాలు తమ సమ్మెను విరమించుకోవడంతో, వేలాది మంది విద్యార్థులకు ఊరట లభించింది. దీనితో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు రేపటి నుంచి (శనివారం) తిరిగి తెరుచుకోనున్నాయి.

MS Dhoni: ధోని ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ

యాజమాన్యాల ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమై, తమకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో సుమారు రూ. 1500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ప్రస్తావించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భట్టి విక్రమార్క, ప్రభుత్వం తరఫున కీలక హామీలతో సమస్యను సత్వరం పరిష్కరించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసిందని తెలియజేశారు. అంతేకాకుండా, తక్షణమే మరో రూ. 600 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మిగిలిన రూ. 300 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ విధంగా, యాజమాన్యాలు కోరిన పూర్తి బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.

బకాయిల చెల్లింపుతో ప్రస్తుత సమస్య పరిష్కారమైనప్పటికీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో భవిష్యత్తులో ఇలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి, సకాలంలో పారదర్శకంగా చెల్లింపులు జరిగేలా కొత్త మార్గదర్శకాలను సూచించడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని అమలు చేయనుంది.

Sajjala Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం.. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు..!

Exit mobile version