Site icon NTV Telugu

Constable Exam: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. వదంతులు నమ్మొద్దు

Tspolice

Tspolice

తెలంగాణలో లక్షలాదిమంది అభ్యర్ధులు పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమనరీ పరీక్ష కూడా జరిగింది. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష(Constable Preliminary Exam) ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నపత్రంలో గందరగోళం ఏర్పడింది. కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు.. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది.

Read Also: Mrunal Thakur : ‘సీతారామం’తో మృణాల్ ఖాతాలో మరో మిలియన్ ఫాలోవర్స్

కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై దృష్టి పెట్టింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు నమ్మవద్దంటూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. సెట్ డి లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ కు ఫిర్యాదులు అందాయి. పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని, రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. వివరణ ఇచ్చేంతవరకు వదంతులు నమ్మవద్దంటూ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.

నిపుణుల కమిటీ తో చర్చించి వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది రిక్రూట్మెంట్ బోర్డ్. 15,644 పోస్టులకు గాను 9.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రిలిమినరీ పరీక్షలో మైనస్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా సమాధానాలు గుర్తించారు. 60 మార్కులు సాధించిన ప్రతీ అభ్యర్థి దీనిలో అర్హత సాధిస్తారు. తర్వాత ఫిజికల్ టెస్టులకు అభ్యర్థులు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది సువర్ణావకాశంగా చెప్పాలి. తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు దొర్లాయని వార్తలు వచ్చాయి. 13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్టు గుర్తించారు. ఫిర్యాదులు ఎక్కువ వస్తే మార్కులు కలిపే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా 8 మార్కులు కలిపేందుకు అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Exit mobile version