Site icon NTV Telugu

Telangana: చైల్డ్ పోర్న్ చూస్తే జైలుపాలే.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక

Telangana Police Adult

Telangana Police Adult

Telangana Police Gives Strong Warning On Child Adult Content: మన దేశంలో ఫోర్నగ్రఫీ సైట్లను ఎప్పుడో బ్యాన్ చేశారు. అయినప్పటికీ కొందరు దొంగచాటుగా అడల్ట్ కంటెంట్‌ని ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. ఇలాంటి వారిపై అధికారులు నిఘా పెట్టారు. ఎవరైతే అశ్లీల వీడియోల్ని చూస్తున్నారో.. వారిని పట్టుకొని జైల్లో పెడుతున్నారు. మరీ ముఖ్యంగా.. చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫోటోలు చూసేవారిని, సెర్చ్ చేసే వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 43 మందిని అరెస్ట్ చేశారు. బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్‌ చేసేవారిపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) టిప్‌లైన్స్‌ ఆధారంగా నిఘా పెట్టిన తెలంగాణ పోలీసులు.. నెల వ్యవధిలోనే 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరో 34 కేసులు దర్యాప్తులో ఉండగా.. 8 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.

Girlfriend Ride: బైక్‌పై ప్రియురాలు షికార్లు.. తట్టుకోలేక ప్రియుడు ఏం చేశాడంటే?

దేశవ్యాప్తంగా పీడోఫైల్స్‌ (పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ కలిగి ఉండటం) మనస్తత్వం ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ స్వభావం ఉన్న వారు సోషల్‌ మీడియా, యాప్‌లు, వీడియో గేమ్స్‌ ద్వారా పిల్లలతో స్నేహం పెంచుకొని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కరోనాకి ముందు 2018లో మన దేశంలో ప్రతిరోజూ 110 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యేవారు. లాక్‌డౌన్‌ సమయంలో చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ (సీశామ్‌)కు ఆన్‌లైన్‌లో 200 నుంచి 250 శాతం వరకు డిమాండ్‌ పెరిగినట్టు వెల్లడైంది. టెలిగ్రామ్ మాధ్యమంగా ఈ సీశామ్ కంటెంట్ బాగా వైరల్ అవుతోంది. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ సీశామ్ కేసుల్లో అరెస్టయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు విద్యార్థులు కూడా చైల్డ్‌పోర్నోగ్రఫీకి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు.

Viral : ఖైదీతో పోలీసుల షాపింగ్ మాల్ కు.. వీడియో వైరల్

మన దేశంలో ఈ సీశామ్ కంటెంట్ చట్టవిరుద్ధం కాబట్టి.. కఠిన శిక్షలు తప్పవు. సెక్షన్‌ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షలు వేస్తారు. నెట్టింట్లో ఎవరు చూడరు కదా ఆ కంటెంట్ చూస్తే.. తప్పకుండా జైలుపాలు అవుతారు. ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్‌లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయి. ఒకవేళ ఈ కేసుల్లో నిరూపితం అయితే.. ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త! చైల్డ్ పోర్న్ చూసే దుర్బుద్ధి ఉంటే, వెంటనే మానుకోండి. లేకపోతే.. జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది.

Exit mobile version