Site icon NTV Telugu

Traffic e Challan: చూసుకుని కట్టండి బ్రో.. ట్రాఫిక్‌ ఈ చలాన్‌ పేమెంట్స్‌ ఫేక్‌ వెబ్సైట్‌..!

E Challan

E Challan

Traffic e Challan: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న చలాన్ల క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ పోలీసులు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తగ్గింపు ఆఫర్‌కు వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దాదాపు 2 కోట్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు పోలీసులు ఈ ఆఫర్‌ను తీసుకురాగా, వాహనదారులతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇన్‌వాయిస్‌లు సేకరించేందుకు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి వాహనదారుల ఖాతాల్లోంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. కోట్లలో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read also: Krithi Shetty: నిషా కళ్ళతో మత్తు ఎక్కిస్తున్న కృతి శేట్టి….

అయితే.. ఈ ఆఫర్లలో పోలీసులు మీ సేవా కేంద్రాలతోపాటు https://echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్ ద్వారా చలాన్లు వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే.. ఈ ఆఫర్‌కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో.. పోలీసుల వెబ్‌సైట్లు ఎప్పటికప్పుడు హ్యాంగ్ అవుతున్నాయి. దీనికి తోడు సైబర్ క్రైమ్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. https://echallantspolice.in/ పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించబడింది. దీంతో చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్‌సైట్లలో చలాన్‌లు చెల్లించవద్దు. పోలీసులు సూచించిన అధికారిక వెబ్‌సైట్‌లో చెల్లించాలని సూచించారు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Indian 2 : ఇండియన్ 2 మూవీ షూటింగ్ పూర్తి..సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్..?

Exit mobile version