Site icon NTV Telugu

కోకాపేట భూముల వేలంలో వెయ్యికోట్ల స్కామ్..! రేపు బయటపెడతా..

Revanth Reddy

Revanth Reddy

హెచ్‌ఎండీఏ గురువారం రోజు కోకాపేట భూములు వేలం వేయగా.. అధికారుల అంచనాలకు మించి స్పందన వచ్చింది.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికినట్టు అయ్యింది.. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది.. అయితే, ఈ భూముల వేలం వెనుక వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి… కోకాపేట్‌ భూముల వేలంలో జరిగిన భారీ స్కామ్‌ వివరాలు రేపు బయట పెడతానని ప్రకటించారు.. ఆ భూములు కొన్నది ఎవరు…? ఎవరెవరు ఎవరి బందువులో రేపు వెల్లడిస్తానన్నారు రేవంత్‌ రెడ్డి.

Exit mobile version