Site icon NTV Telugu

Davos : ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ పెవిలియన్

Davos

Davos

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు తో పాటు పెట్టుబడి ప్రకటనలను ప్రకటించాయి. ఈ సారి భారతదేశం నుంచి దావోస్ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్ లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్ ను ప్రశంసించారు. అంతేకాకుండా.. జ్యురిక్ నగరంలో జెడ్‌ఎఫ్‌ కంపెనతో సమావేశం నిర్వహించగా.. తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. సుమారు మూడు వేల మంది ఉద్యోగులతో తన హైదరాబాద్ కార్యాలయం తన అతిపెద్ద కార్యాలయంగా మారుతుందని ప్రకటించింది.

Exit mobile version